సెల్ఫ్ మేనేజ్‌మెంట్ : గ్రోత్ మైండ్‌సెట్ – ఫిక్స్‌డ్ మైండ్‌సెట్

స్వీయ నిర్వహణ – గ్రోత్ మైండ్‌సెట్ & ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ అనే ఈ పరివర్తనాత్మక ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే మీ అందరికీ సాదర స్వాగతం…. సుస్వాగతం!

మీలో గ్రోత్ మైండ్‌సెట్‌ను పెంపొందించి, మీ లక్ష్యాలను సాధించేందుకు, మీలోని అంతర్లీన సామర్థ్యాన్ని పూర్తిగా వెలికితీసేందుకు
మార్గదర్శకంగా నిలిచేందుకు ఈ మాడ్యూల్‌ రూపొందించబడింది.

వేగంగా మారుతున్న నేటి ఆధునిక విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా పాఠశాల నాయకులుగా మనల్ని మనం సమర్థంగా నిర్వహించుకోవడానికి, సరైన దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి వ్యక్తిగత విజయంతో పాటు వృత్తిపరమైన అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైనది.

Growth mindset విధానం అనేది ఒకరి సామర్ధ్యాలు మరియు లక్షణాలను అంకిత భావం మరియు కృషి ద్వారా అభివృది చేయవచ్చనే నమ్మకం.
దీనికి విరుద్ధంగా Fixed Mindset విధానం అనేది ఒకరి సామర్ధ్యాలు మరియు లక్షణాలు స్థిరంగా ఉంటాయని మరియు వాటిని మార్చ లేమని నమ్మడం.

గ్రోత్ మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే
సవాళ్లను భయపడకుండా స్వీకరిస్తాం,
అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాం,
శ్రమను నైపుణ్యానికి అవసరమైన మార్గంగా చూస్తాం,
వైఫల్యాన్ని ఓ పాఠంగా స్వీకరిస్తాం.

ఈ మాడ్యూల్ మీలో వృద్ధి మనస్తత్వాన్ని అభివృద్ధి చేయడానికి మరియు పరిమితం చేసే నమ్మకాలు మరియు ఆలోచనా విధానాలను అధిగమించడానికి ఆచరణాత్మక సాధనాలు మరియు వ్యూహాలను అందిస్తుంది.
ఈ కోర్సు మొత్తం మీద, మీరు స్థిరమైన మనస్తత్త్వం ఆధారంగా ఉన్న నమ్మకాలను గుర్తించడం, నెగటివ్‌ స్వయంసంభాషణను సానుకూల దిశలో మార్చుకోవడం, వాస్తవిక లక్ష్యాలు నిర్ధారించుకోవడం, సహనశక్తి మరియు పట్టుదలలను పెంపొందించుకోవడం నేర్చుకుంటారు.

అదేవిధంగా, వ్యక్తిగత జీవితంలోనే కాక, వృత్తిపరమైన సంబంధాల్లో కూడా గ్రోత్ మైండ్‌సెట్‌ను ఎలా పెంపొందించాలో ఈ మాడ్యూల్‌ మీకు దిశను చూపిస్తుంది.

🖥️
ఒక నాయకుడు గ్రోత్ మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే –
తన బృందాన్ని సవాళ్లను సాహసంగా ఎదుర్కొనేలా చేస్తాడు,
విఫలమయినా కుంగిపోకుండా నేర్చుకునేలా ప్రేరేపిస్తాడు,
కృషినే విజయానికి మెట్టు అని బోధిస్తాడు.

SWOT విశ్లేషణ, ఆత్మపరిశీలన కార్యక్రమాలు, ప్రాయోగిక ఉదాహరణలు
మీరు మీ నాయకత్వ శైలిని, మీ దృక్పథాన్ని, మీ వ్యక్తిత్వాభివృద్ధిని పూర్తిగా మారుస్తుంది.
ఈ శిక్షణ మీకు ఆత్మవిశ్వాసాన్ని, స్పష్టమైన దిశ దశను, కార్యాచరణ కౌశల్యాలను అందిస్తుంది.

👉 మనం అందరం కలసి – స్వీయ నిర్వహణలో ఉన్నత స్థాయిని చేరుకుంటూ, మనలో దాగి ఉన్న సంపూర్ణ సామర్థ్యాన్ని ‘మైండ్‌సెట్ శక్తి’ ని వెలికితీసే ఈ సాయాధికారిత ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

అభ్యాస లక్ష్యాలు ఈ సెస్‌షన్ ముగిసే నాటికి మీరు –

SWOT విశ్లేషణను స్వీయ అవలోకనానికి, స్వీయాభివృద్ధికి ఒక శక్తివంతమైన పరికరంగా ఉపయోగించటం నేర్చుకుంటారు.

మీరు ప్రస్తుతం ఏ మైండ్‌సెట్‌లో ఉన్నారో స్పష్టంగా తెలుసుకుంటారు

సానుకూలమైన, గ్రోత్ మైండ్‌సెట్ దృక్పథాన్ని అలవర్చుకుంటారు

మీలోని స్వీయ పరిమిత విశ్వాసాలను అధిగమిస్తారు

కార్యాలయంలో భిన్నతలను గౌరవిస్తూ, పెద్ద లక్ష్యాల కోసం సమన్వయంగా పనిచేయటాన్ని నేర్చుకుంటారు.

స్వీయ నిర్వహణ (Self-Management) – మైండ్‌సెట్ పాత్ర

స్వీయ నిర్వహణ (Self-Management) అనేది –
విభిన్న పరిస్థితులలో మన భావోద్వేగాలను, ఆలోచనలను, ప్రవర్తనలను సమర్ధవంతంగా నియంత్రించుకునే సామర్థ్యం అని మనందరికీ తెలుసు…

ఇది స్వీయ నియంత్రణ (Self-Discipline)
అంతర్గత ప్రేరణ (Motivation)
లక్ష్య నిర్ధారణ (Goal Setting)
సవాళ్లను అధిగమించే శక్తి (Overcoming Challenges)

కానీ ఈ స్వీయ నిర్వహణకు మూల హృదయం మన “మైండ్‌సెట్”.
మన మీద మనకు ఉన్న నమ్మకాలు, మన సామర్థ్యాలపై మనకు ఉన్న విశ్వాసాలు – ఇవే మన మైండ్‌సెట్‌ను నిర్ధారిస్తాయి.

👉 గ్రోత్ మైండ్‌సెట్, ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ మధ్య తేడాను అర్థం చేసుకోవడమే – బలమైన స్వీయ నిర్వహణకు, వ్యక్తిగత మరియు వృత్తి పరమైన విజయానికి పునాది.

ఈ కోర్సు యొక్క ముఖ్య అంశాలను చూద్దాం.

ఈ శిక్షణలో మీరు కింది కీలక అంశాలను లోతుగా అవగాహన చేసుకుంటారు:

  • Understanding Mindset * మైండ్‌సెట్ అంటే ఏమిటి?
  • Fixed Mindset Characteristics * ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ లక్షణాలు
  • Growth Mindset Characteristics గ్రోత్ మైండ్‌సెట్ లక్షణాలు
  • How Mindsets Form మైండ్‌సెట్ ఎలా ఏర్పడుతుంది?
    *Personal SWOT Analysis వ్యక్తిగత SWOT విశ్లేషణ
  • Practical Application Through Examples ప్రాయోగిక ఉదాహరణల ద్వారా అన్వయము
  • Strategies for Developing Growth Mindset గ్రోత్ మైండ్‌సెట్‌ను అభివృద్ధి చేసే వ్యూహాలు

మైండ్‌సెట్ అంటే ఏమిటి? (What is a Mindset?)
అనేది మనం ముందుగా అర్ధం చేసుకొందాం.

మైండ్‌సెట్ అనేది –
ఒక వ్యక్తి లేదా ఒక సమూహం కలిగి ఉండే
ఆలోచనలు, నమ్మకాలు, ఊహాగానాలు, అభిప్రాయాల సమాహారం.

మైండ్‌సెట్ మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణంలో ఒక భాగం.

ఒక వ్యక్తి యొక్క మైండ్‌సెట్ అతని – చర్యలను, నిర్ణయాలను, ప్రవర్తనను
ఆసక్తులను మరియు ఇష్టాలను ప్రభావితం చేస్తుంది.

మైండ్‌సెట్ మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను మనం ఎలా అర్థం చేసుకుంటామో చెప్పే కన్నుల్లాంటివి (lenses).

👉 ఒక సవాలు ఎదురైనప్పుడు –
మీరు దానిని ముప్పుగా చూస్తారా? లేదా అవకాశంగా చూస్తారా?

ఈ ఒక్క ప్రశ్నకు…. మీరు ఇచ్చే సమాధానమే –మైండ్‌సెట్టుకు నిదర్శనం.
మీ ఆలోచనా విధాన ధోరణిని వెల్లడించడమే కాకుండా మీ సమస్యలు, అభ్యాసం మరియు వృద్ధిని ఎలా ఎదుర్కొంటారు అనే దానిపై గణనీయంగా ప్రభావం చూపుతుంది.


స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త
డా. కెరల్ డ్వెక్ (Carol Dweck) పరిశోధనల ప్రకారం –
మన మైండ్‌ సెట్ అంటే మన ఆలోచనా విధానం.
మైండ్‌ సెట్ ప్రధానంగా రెండు రకాలు కలిగి ఉంటుంది.

  1. ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ (Fixed Mindset)
  2. గ్రోత్ మైండ్‌సెట్ (Growth Mindset)

ఈ రెండింటినీ అర్థం చేసుకోవడమే – స్వీయ అవగాహన.

మన జీవితాన్ని మలుచుకునే నమ్మకాలను మనమే సృహతో ఎంచుకునే శక్తికి పునాది.

ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ అంటే ఏమిటి?

ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ అంటే –
మన బుద్ధి, తెలివి తేటలు, స్వభావం, వ్యక్తిత్వం, సృజనాత్మక ప్రతిభ
మారదు – అవి స్థిరమైనవే అనే నమ్మకం.

ఈ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి –
“నేను ఎంత ప్రయత్నించినా మారను, నేను ఇంతే”
అని విశ్వసిస్తాడు.

డా. కెరల్ డ్వెక్ చెప్పినట్లు –
మన లక్షణాలు రాతిలో చెక్కినట్లే స్థిరంగా ఉన్నాయనే భావన ఉండటం వల్ల –
పదే పదే నిరూపించుకొనే ఆవశ్యకత ఏర్పడుతుంది.

మన మేథస్సు ఒక పరిమితి వరకే ఉందని,
మన వ్యక్తిత్వం ఒక స్థాయికే పరిమితమని నమ్మితే –
మనలో లోపం కనిపిస్తుందేమోననే భయంతో
నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తూ మనం మన విలువను నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉంటాం.